సాగర్ కాల్వలో లారీ డ్రైవర్ గల్లంతు

హాలియా : నల్లగొండ జిల్లా హాలియా ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన రామిశెట్టి వెంకటరామ సత్యనారాయణ(35) వృత్తి రీత్యా లారీ డ్రైవర్.

జడ్చర్ల నుంచి గుంటూరుకు లారీ లోడుతో వెళ్తూ మార్గమధ్యంలో హాలియా బ్రిడ్జి వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యాడు. ఆచూకీ దొరకలేదు. అనంతరం మృతుడి తమ్ముడు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ డి.క్రాంతికుమార్ తెలిపారు.