Maharajpeta Sarpanch Dosada.. విద్యార్థులను దాతలు ఆదుకోవడం సంతోషకరం

  • మహరాజ్ పేట్ సర్పంచ్ దోసాడా నరసింహారెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే  విద్యార్థులను దాతలు ఆదుకోవడం సంతోషకరమని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహరాజ్ పేట్ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి కొనియాడారు. గురువారం గ్రామంలోని రేసు సత్తిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం గచ్చిబౌలి శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.

ఈ  ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా తాగేందుకు  మంచి మినరల్ నీరు అందుతుందని తెలిపారు. ఈ నీటి వల్ల విద్యార్థులకు ఎలాంటి హాని జరగదని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ నీరు దోహదపడుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ ఉచితంగా అందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాహెర్ అలీ, జీవనజ్యోతి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బద్రి శ్రీకాంత్, యాదగిరి, రంగారెడ్డి, జాతీయ ఐటి టీం సభ్యులు డి.విష్ణువర్ధన్ రావు, లక్ష్మీనారాయణ, కె.వెంకటేశ్వరరావు, పి.సుబ్బారావు, పివి శ్రవణ్, డాక్టర్ బిసి. రమణ,  శర్మ, టి రాహుల్ సాగర్, హరి, టి.ఉషారాణి, సుబ్బలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు సరిత, అనసూయ, సంగీత, రవీందర్ రెడ్డి, బాలరాజు, కృష్ణ, సుమతి, రియాజ్, రాజేందర్ రెడ్డి, పుష్పలత, అశోక్, జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.