మోకిలాను మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లోనూ కలపొద్దు

రచ్చబండ, శంకర్ పల్లి : మోకిలా గ్రామాన్ని మున్సిపాలిటీలో గానీ కార్పొరేషన్ లోనూ కలుపొద్దని శంకరపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు నాయక్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాదారు.

గత కొంతకాలంగా శంకర్ పల్లి మండల పరిధిలోని మోకిలా, శేరిగూడెం, మోకిల తాండ గ్రామపంచాయతీలను శంకర్ పల్లి మున్సిపాలిటీలో కలిపి కార్పొరేషన్ చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయని అన్నారు. మోకిలా గ్రామాన్ని గ్రామపంచాయతీగానే ఉంచాలని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీలు గానే ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికన మోకిలా గ్రామంలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ వచ్చిందని అన్నారు. మోకిలా క్లస్టర్ లోని 13 గ్రామాలను కలిపి మోకిలాను మండల కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజు నాయక్ కోరారు.