బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిక

గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

 

రచ్చబండ, శంకర్ పల్లి: సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు ఎందరో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమౌళి, వార్డు అధ్యక్షుడు పాండు యాదవ్, మున్సిపల్ ఎస్టీ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, సీఎం అడుగుజాడల్లో నడవడానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.

 

గ్రామాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి కార్యకర్త సరైన రీతిలో తిప్పి కొట్టాలన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భానూరు వెంకటరామిరెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, మున్సిపల్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి, నాయకులు సాత ప్రవీణ్ కుమార్, చేకూర్త గోపాల్ రెడ్డి, పార్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.