Home Latest News TPUS Leader Sudheer.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

TPUS Leader Sudheer.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

  • టీయూపీఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు సుధీర్
  • చేవెళ్ల ఆర్డీవోకు వినతిపత్రం అందజేత

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీయూఎస్ గౌరవ అధ్యక్షులు సుధీర్ కోరారు. సోమవారం చేవెళ్ల ఆర్డివో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ వేసి వెంటనే భృతిని ప్రకటించాలన్నారు.

సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తెలిపారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించి సూపర్ న్యుమరికల్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. పండిట్ పీఈటీల పోస్టులను అప్ గ్రేడేషన్ చేయాలన్నారు.

ఏకీకృత సర్వీస్ రూల్స్, ఇతర అంశాలపై ఉన్న కేసులను కోర్టు ద్వారా పరిష్కరించి అన్ని కేటగిరీలలో ప్రమోషన్లు, బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కృష్ణ, చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్, చేవెళ్ల శంకర్ పల్లి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, ఉపాధ్యాయులు జంగయ్య, శ్రీను, హరిశంకర్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.