PCC Member Rachamalla Siddheswar.. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి

  • పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
  • పీసీసీ మెంబర్ రాచమల్ల సిద్ధేశ్వర్

రచ్చబండ, శంకర్ పల్లి: ఈసారి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా శ్రమించాలని పీసీసీ మెంబర్ రాచమల్ల సిద్ధేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈసారి చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కైవసం అవుతుందని చెప్పారు. అందుకు నాయకులు, పార్టీ కార్యకర్తలు సైనికుల శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణి వ్యవస్థతో రైతులు సతమతమవుతున్నారని చెప్పారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇచ్చిన వారి గెలుపు కోసం శ్రమించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అరవయ్య, మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్ బాషా, నాయకులు ఎండీ. నయీమ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.