Shankerpally Mandal Anthappaguda.. అంతప్పగూడలో రోడ్ల నిర్మాణంలో వివక్ష

  • పరివేద పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పరమేశ్వర్ గౌడ్

రచ్చబండ, శంకర్ పల్లి: అంతప్పగూడ గ్రామంలో రోడ్ల నిర్మాణంలో గ్రామ సర్పంచ్, అధికారులు వివక్ష చూపుతున్నారని పరివేద పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పరమేశ్వర్ గౌడ్ ఆరోపించారు. ఆయన శంకర్ పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామంలో రోడ్లు నలువైపులా వేసి తాము నివసిస్తున్న ప్రాంతాల్లో సిసి రోడ్లు నిర్మించడం లేదని తెలిపారు.

కక్ష గట్టి తమ ఇండ్ల వెనుకాల మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించడం లేదని ఆయన ఆరోపించారు. గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ మురుగు కాలువలు నిర్మించారని తమ ఇంటి వెనకాల  నిర్మించడం లేదని వాపోయారు.

గ్రామపంచాయతీ అధికారులు కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. మురుగు కాలువలు తమ పరిసరాల్లో సరిగ్గా లేనందున దోమలు, ఈగల బెడద అధికంగా ఉందని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమ ఇంటి పరిసరాలు అండర్ డ్రైనేజ్ మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించాలని పరమేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.