కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం

• 2024 ఎన్నికల కోసం మూడంచెల కమిటీలు
కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు రెడీ అయింది. ఈ మేరకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వ్యూహాలు రచించేందుకు ఉద్దండ పండితులతో మూడు కమిటీలను ఆ పార్టీ నియమించింది. అసంతృప్త నేతలకు ఆయా కమిటీల్లో చోటు కల్పించడం విశేషం.

తాజాగా ప్రియాంక గాంధీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు.
ఇటీవలే రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిరంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ మేరకు వేగంగా ఎన్నికల గోదాలోకి దిగేందుకు రెడీ అవుతున్నది.

ఈ మేరకు ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీలతో పాటు రాహుల్ చేపట్టే దేశవ్యాప్త యాత్ర కోసం భారత్ జోడే యాత్ర కమిటీని ఎంపిక చేశారు. ఆయా కమిటీలతో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని కట్టుదిట్టం చేసి విజయమే పరమావధిగా ముందుకు సాగనున్నది.

కమిటీలు.. సభ్యులు
పొలిటికల్ అఫైర్స్ కమిటీ
రాహుల్ గాంధీ
గులాంనబీ ఆజాద్
దిగ్విజయ్ సింగ్
మల్లికార్జున్ ఖర్గే
కేసీ వేణుగోపాల్
అంబికా సోని
ఆనంద్ శర్మ
జితేంద్రసింగ్

టాస్క్ ఫోర్స్ -2024 కమిటీ
ప్రియాంకాగాంధీ
కేసీ వేణుగోపాల్
రణదీప్ సూర్జేవాలా
చిదంబరం
ముకుల్ వాస్నిక్
జయరాం రమేశ్
అజయ్ మాకెన్
సునీల్ కనుగోలు

భారత్ జోడే పాదయాత్ర కమిటీ
శశిథరూర్
సచిన్ పైలట్
దిగ్విజయ్ సింగ్
కేజే జార్జ్
రణవీత్ సింగ్ బిట్టూ
ప్రద్యుత్ బోల్ దోలోయీ
జీతూ పట్టారి
సలీమ్ అహ్మద్