పవన్, రేణు కలిసిన శుభవేళ

• అకీరానందన్ స్కూల్ ఫంక్షన్ ఫొటో వైరల్
పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయి చాలాకాలమైంది. కానీ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు. అయితే చాలా కాలం తర్వాత వారు మళ్లీ కలుసుకున్నారు. వారు తమకు కలిగిన పిల్లలతో దిగిన ఫొటో తాజాగా వైరల్ గా మారింది.

పవన్, రేణుదేశాయ్ విడిపోయాక వారి కొడుకు, కూతురైన అకీరానందన్, ఆధ్య రేణుదేశాయ్ వద్దే ఉంటున్నారు. ఆ మధ్య రేణుదేశాయ్ వేరొకరితో పెళ్లి చేసుకుంటారన్న వార్తలు షికారు చేశాయి. ఓ దశలో ఆమె కూడా ఓపెన్ అయ్యారు. కానీ పవన్ అభిమానుల నుంచి వద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చింది.

అభిమానుల అభ్యంతరమా లేక తానే వద్దనుకుందో ఏమో కానీ మరో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ అకీరా మెగా ఫ్యామిలీలో కనిపిస్తూ ఉన్నాడు. భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లల విషయంలో ఇద్దరూ బాధ్యతగానే ఉన్నారని తెలుస్తోంది.

అయితే తాజాగా అకీరానందన్ చదివే పూణేలోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో అకీరానందన్ కోసం తల్లి రేణుదేశాయ్, తండ్రి పవన్ కల్యాణ్, చెల్లి ఆధ్య కలిసి పాల్గొన్నారు.

స్కూల్ డే ఫంక్షన్ లో వారు నలుగురూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. చూడచక్కని చిత్రం, అద్భుతమైన ఫొటో, స్వీట్ మెమొరీ.. అన్న శీర్షికలతో ఫొటోను షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది.