హోరాహోరీగా బండలాగుడు పోటీలు

• పోటీలను ప్రారంభించిన జగదీశ్వర్ రావు
రచ్చబండ, చిన్నంబాయి : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో సత్యమ్మ తల్లి జాతరను పురష్కరించుకొని ఆదివారం నిర్వహించిన బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. మొదట పోటీలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి చింతలపల్లి జగదీశ్వరరావు ప్రారంభించారు.

జాతర ఉత్సవాల సందర్భంగా రైతు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ బండలాగుడు పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఈ పోటీలను చూసేందుకు సమీపంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ పోటీలకు చింతలపల్లి జగదీశ్వర రావు రూ. 60 వేలను విరాళంగా ఇచ్చారని నిర్వాహకులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిన్నంబాయి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ పుల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ రవివర్మ, దగడపల్లి మాజీ సర్పంచ్ ఖాదర్, నరేందర్ గౌడ్, మియాపూర్ గ్రామ పార్టీ నాయకులు బీరప్ప, గ్రామ సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు.