చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్ గా గంగా రంగారెడ్డి బాధ్యతలు

రచ్చబండ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్ ఇదే మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన గంగా రంగారెడ్డి బుధవారం సంఘం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గా పనిచేసిన అనంత శ్రీనివాన్ గౌడ్ రాజీనామా చేయడంతో వైన్ చైర్మన్ అయిన రంగారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా సహకార సంఘు అధికారి శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం కోసం జిల్లా కలెక్టర్ కు, జిల్లా సహకార సంఘం అధికారికి 10 మంది డైరెక్టర్ల వినతిపై ఆదేనెల 30న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సభ్యుల గైర్హాజరుతో అవిశ్వాసం వీగిపోయి౦ది. దీంతో చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్ కొనసాగుతూ వచ్చారు.

ఇదిలా ఉండగా, 2020-21లో ఇదే సహకార సంఘములో ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని డైరెక్టర్లు జిల్లా కలెక్టరు, జిల్లా సహకార సంఘం అధికారికి ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు ఫైవమెన్ కమిటీతో విచారణ జరిపిస్తున్నామని జిల్లా సహకార రామం అధికారి శ్రీధర్ వెల్లడించాడు. ఈ దశలో చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాజీనామా చేయగా, దానిని ఆమోదిస్తూ జిల్లా సహకార సంఘం అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఉత్తర్వుల్లో వైన్ చైర్మన్ గంగార oగారెడ్డికి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో చెరిన గంగా రంగారెడ్డి
చిల్లేపల్లి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గంగా రంగారెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంగారెడ్డికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొనతం చిన వెంకట్ రెడ్డి కాంగ్రెస్స్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైస్ ఛైర్మన్ అయిన రంగారెడ్డికి ఛైర్మన్గా నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ఆయన ఛైర్మన్ గా పదవీ బాద్యతలు చేపట్టారు.