అనుమాననాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమాననాస్పద స్థితిలో మహిళ మృతి

 

రచ్చబండ, శంకర్ పల్లి: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామ శివారులోని బీరప్ప దేవాలయం ఎదురుగా జరిగింది. మోకిలా పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జనవాడ గ్రామ శివారులో గల బీరప్ప దేవాలయం ముందు సోమవారం గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని ఉదయం 9.15 ప్రాంతంలో గుర్తించినట్లు మోకిలా పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.

మృతి చెందిన మహిళ తెలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు టీ షర్ట్, పింక్ కలర్ టాప్ ధరించి ఉందన్నారు. ఆమె వయసు 20 నుండి 25 సంవత్సరాల వరకు కలిగి ఉంటుందని తెలిపారు. కుడి చెయ్యి విరిగి ఉందని ఆ చేతిపై మెహందీ తో రశ్మి, సర్వాన్ ఖాన్, కిరణ్ సార్, రవి తేరా లవ్ యు.. అని రాసి ఉందని చెప్పారు.

కాగా సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని శివ పరీక్ష నిర్వహించి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్నట్లు మోకిలా పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.