రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించారు. వారిలో దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.