20న నల్లగొండ జిల్లాలో పవన్ పర్యటన

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ 20వ తేదీన నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ కూడా విడుదలైనట్లు అభిమాన సంఘాలు తెలిపాయి.

జిల్లాలోని చౌటుప్పల్, కోదాడ పట్టణాలకు ఆయన రానున్నారు. చౌటుప్పల్, హుజూర్ నగర్ పరిధిలో మరణించిన ఇద్దరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను ఈ సందర్భంగా పవన్ పరామర్శించనున్నారు.

ఆయా కుటుంబాలకు సుమారు రూ.5 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన హుజూర్ నగరుకు చెందిన జన సైనికుడు కడియం శ్రీను కుటుంబ సభ్యులను కోదాడ పట్టణానికి రావాలని ఇప్పటికే సమాచారం పంపారు.