కూతురిపై కన్నేసిండని ప్రియుడి పురుషాంగం కోసేసింది!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : మానవ సంబంధాలు ఒకసారి కట్టుతప్పితే ఎటువైపైనా దారితీసే అవకాశం ఉంది. వివాహేతర బంధాలైతే ప్రాణాలు తీసేదాకా వెళ్తాయి. అలాంటి బంధాలకు అలవాటు పడ్డవారు ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి ఓ చిత్రమైన ఘనటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లా పరిధిలోని కమలాపూర్ కు చెందిన హరిశంకర్ కు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.

ఈ దశలోనే ఆ మహిళ కూతురిపైనా హరిశంకర్ మనసు పారేసుకున్నాడు. ఆమెతోనూ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం ఆ మహిళకు తెలిసిపోయింది.

ఈ విషయంపై హరిశంకర్ ను ఆ మహిళ నిలదీసింది. తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికింది. తనను తప్ప పరాయి మహిళను తన ప్రియుడు చూడొద్దనుకుందో.. తన కూతురిని చెడగొట్టొదని అనుకుందో కానీ.. కాళ్లావేళ్లా పడి బతిమాలిందిజ

హరిశంకర్ మాత్రం తన వైఖిరిని మార్చుకోలేదు. ఆమె కూతురి కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. దీంతో అతడిపై ఆమెకు కసి పెరిగింది. ఇక ప్లాన్ రెడీ చేసుకుంది. ఒకచోట ఉన్నప్పుడు కసిదీరా అతడి పురుషాంగాన్ని కత్తితో కోసేసింది.

ఈ ఘటనపై ఆ మహిళ తరుఫునే పోలీసులకు ఫిర్యాదు చేశారు. థ్రిస్ట్ ఏంటంటే.. ఆ మహిళపై అతడు లైంగిక దాడికి పాల్పడబోతే అతడి పురుషాంగాన్ని కోసిందని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.