ఉద్యానవనాల నగరంగా గుర్తింపు ఉన్న హైదరాబాద్ మహానగరం మరో గుర్తింపును దక్కించుకుంది. 2020లో దక్కిన అవార్డే మళ్లీ మన నగరాన్ని వరించింది. ఇది హైదరాబాదీయులతో పాటు రాష్ట్రవాసులకు గర్వకారణంగా నిలిచింది.
అర్బన్ డే ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతీ ఏటా ప్రపంచ స్థాయిలో ట్రీ సిటీ (చెట్ల నగరాలు) లను గుర్తిస్తుంది. అలా 2020లో హైదరాబాద్ కు మొదటిసారి ప్రపంచ స్థాయి ట్రీ సిటీ అవార్డు దక్కింది. మళ్లీ 2022లో మరోసారి అదే అవార్డుకు ఎంపిక కావడం విశేషం.
ఈ రెండేళ్లలో మరో 3.50 కోట్ల మొక్కలు నాటినట్లు సంస్థ గుర్తించింది. మొక్కల పెంపకం, చెట్ల సంరక్షణ ప్రాతిపదికగా ట్రీ సిటీగా గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది.
2020లో 2.4 కోట్ల మొక్కలతో ప్రపంచంలోనే 51 ట్రీసిటీలలో హైదరాబాద్ ఒకటిగా గుర్తించారు. ఇండియాలో ఏకైక నగరంగా కూడా హైదరాబాద్ నిలవడం విశేషం.
ట్రీ సిటీ ఎంపికలో ముఖ్యంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో చెట్ల సంరక్షణ సిబ్బందికి అప్పగింత, నగర పరిధిలో అడవులు, చెట్ల నిర్వహణపై చట్టం, అధికారిక విధులు,
ట్రీ మేనేజ్ మెంట్ ప్లాన్, చెట్ల సంరక్షణకు ప్రత్యేక వార్షిక బడ్జెట్, మొక్కలు, చెట్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన, వేడుకల నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.