అంబేద్కర్ విగ్రహావిష్కరణ చారిత్రాత్మకం

  • సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్

రచ్చబండ, శంకర్ పల్లి: హైదరాబాద్ మహానగరం నడి బొడ్డున అంబేద్కర్ జయంతి రోజు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల అంబేద్కర్ సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఇంతకీ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన విలేకరులతో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వెంకటయ్య, సభ్యులు నగేష్, శంకర్, ఆనంద్, ఉపాధ్యాయులు రాములు, కుశాల్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.