ఆడపడుచులను అన్నలా ఆదుకుంటున్న కేసీఆర్

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ఆడపడుచులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఓ తండ్రిలా, ఒక అన్నలా ఆదుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల  ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం శంకర్ పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు, 40 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 19 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అలాగే ముస్లిం మైనారిటీ ఆడపడుచులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలు అందించడంలో ముందు వరుసలో ఉందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్.విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ భానూరు వెంకటరామిరెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావలి గోపాల్, తహసిల్దార్ నయీముద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, చంద్రమౌళి, అశోక్, మాజీ ఉప సర్పంచ్ సాతా ప్రవీణ్ కుమార్, పలు గ్రామాలకు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.