శభాష్ సర్పంచ్ నరసింహారెడ్డి!

  • ఉదారత చాటుకున్న పొద్దుటూరు సర్పంచ్
  • హామీ మేరకు గ్రామస్తులకు అంబులెన్స్ ఉచితంగా అందజేత

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామ ప్రజలకు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి గత నాలుగేండ్ల క్రితం ఇచ్చిన మాట నిలుపుకున్నారు. గ్రామస్థులతో శభాష్ అనిపించుకున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని  గ్రామంలో ప్రజల సౌకర్యం అంబులెన్స్ ను ఉచితంగా అందించారు. గతంలో గ్రామం నుండి హైదరాబాద్ బస్టాప్ వరకు, అక్కడి నుండి గ్రామస్తులను గ్రామంలో చేరువేసేందుకు గ్రామస్తులకు ఉచితంగా ఆటోను అందించారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు వైద్య సేవల కొరకు అంబులెన్స్ ను సర్పంచ్ అందించడంతో గ్రామస్తులు నరసింహారెడ్డికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు జంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.