అంబేద్కర్ జీవితం దేశానికి ఆదర్శం 

  • సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గౌండ్ల రవీందర్ గౌడ్
  • ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రచ్చబండ, శంకర్ పల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించి సామాజిక సంస్కర్తగా  దేశ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ అన్నారు.  అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో సీఎం కేసీఆర్ ఆవిష్కరణ చేశారని తెలిపారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు ఉంటుందని చెప్పారు.

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన వారిలో శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్, రాష్ట్ర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్, మిర్జాగూడ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు అంజయ్య, గ్రామ వార్డు సభ్యులు, నాయకులు ఉన్నారు.

టంగుటూరులో బీజేపీ ఆధ్వర్యంలో..

శంకర్ పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చేవెళ్ల నియోజకవర్గం బీజేపీ నాయకులు వర్రీ తులసి రామ్ విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు బసగాళ్ల రాముడు గౌడ్, టిఎస్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ శ్రీనివాస్, ఆర్మీ వెంకటేష్, బిజెపి ఉపాధ్యక్షుడు బొల్లారం శశికాంత్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు నరసింహారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు బద్దం ప్రశాంత్ రెడ్డి, శక్తి కేంద్ర గ్రామ ఇంచార్జ్ సాయికుమార్, ఐ టి ఎస్ ఎన్ కన్వీనర్ శశికాంత్ రెడ్డి, కార్యకర్తలు అంబేద్కర్ కు నివాళులర్పించారు.