ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. రెండు కేసుల్లో వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి. మొత్తంగా పాతికేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలానికి చెందిన ఓ నిందితుడు (30) అదే ప్రాంతంలో ఉండే మూడో తరగతి చదివే ఏడేళ్ల చిన్నారిపై, ఏడో తరగతి చదివే మరో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

రెండు కేసులు సైబరాబాద్ మెట్రోపాలిటన్ జడ్జి కోర్టులో విచారణ జరిపారు. తాజాగా జడ్జి ఆర్.తిరుపతి తీర్పును వెలువరించారు. మొదటి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ వేర్వేరు తీర్పులు వెల్లడించారు. నిందితుడిపై మరో రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.