మలుపు తిరిగిన ‘మహా’ రాజకీయం

• సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే?
విశ్లేషకుల అంచనా ప్రకారం మహారాష్ట్ర రాజకీయ మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ థాక్రే రాజీనామాతో బీజేపీ, షిండే వర్గం ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చివరి వరకూ షిండే వర్గం మెత్తపడుతుందేమోనని అనుకున్న అఘాడీ, శివసేన అధినేతలకు నిరాశే మిగిలింది.

ఈ పరిణామంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపికయ్యే అవకాశముంది. ఉప ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండేను తీసుకోనున్నారని రాజకీయ వర్గాల అంచనా. దీంతో బీజేపీ వర్గాల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా బీజేపీనే తమ పార్టీ చీలికకు కారణమంటూ శివసేన దుమ్మెత్తి పోస్తుండగా, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ బీజేపీ చెప్తోంది. ఏదేమైనా ఎవరు కారణమైనా సిద్ధాంత వైరుధ్యాలున్న మూడు పార్టీల పొత్తు మూణ్నాళ్ల ముచ్చటే అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.