అగ్నికీలల్లో 46 మంది ఆహుతి

అగ్నికీలల్లో 46 మంది ఆహుతి
తైవాన్ : తైవాన్‌లో గురువారం తెల్లవారుజామున  ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రానికి ప్రమాద మృతుల సంఖ్య 46కు చేరి, తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 46 మంది సజీవం దహనమయ్యారు. మ‌రో 79 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో 14 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్టు వార్తలందుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ తైవాన్‌లో కౌహ్సియుంగ్ నగరంలోని 13 అంత‌స్తుల టవర్ బ్లాక్‌లో ఉద‌యం 3 గంట‌ల‌కు మంటలు చెల‌రేగాయని స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. భారీగా ఎగిసిన అగ్నికీల‌ల్లో 46 మంది చిక్కుకొని  అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు.