కొండ చరియల కింద బయట పడుతున్న జవాన్ల శవాలు

రచ్చబండ :బండరాళ్ల కింద శవాల గుట్టలు తేలుతున్నాయి. జవాన్ల మృతదేహాలు బయట పడుతున్నాయి. గురువారం జరిగిన ఘోర దుర్ఘటనలో 8మంది సైనికులు మృత్యవాత పడ్డారు. శుక్రవారం నాటికి మృతుల సంఖ్యల 14కు చేరుకుంది.
మణిపూర్ రాష్ట్రంలోని నోని జిల్లాలోని ఆర్మీ బేస్ క్యాంపుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో రెండు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. బండరాళ్ల కింద శవాలు తేలుతున్నాయి.

కొండ చరియల కింద చిక్కుకున్న 23 మందిని రక్షించి వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. బండరాళ్ల తొలగింపు పనిలో రెస్క్యూ టీం నిరంతరంగా శ్రమిస్తోంది.

శిథిలాల కింద 60 మంది గల్లంతు?
విరిగిపడిన కొండ చరియల కింద ఇంకా సుమారు 60 మంది ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. తమ వారు ఎక్కడ అంటూ ఆందోళనలో గడుపుతున్నారు.