10 లక్షలతో రావులపల్లి- కొత్తగూడెం రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం

  1. 10 లక్షలతో రావులపల్లి- కొత్తగూడెం రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం

 

రచ్చబండ. శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని రావులపల్లి నుండి పర్వేద గ్రామ అనుబంధ గ్రామమైన కొత్తగూడెం వరకు హెచ్ఎండిఏ నిధులు 10 లక్షల రూపాయలతో రోడ్డు పనులు సోమవారం ప్రారంభించామని ఆ గ్రామ సర్పంచ్ కాముని పావని హనుమంత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహాయ సహకారంతో ఈ రోడ్డు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు. రోడ్డుకు 10 లక్షల నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కౌకుంట్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపిటిసి కాముని హనుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కౌకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు జోన్ల కిష్టయ్య, బొజ్జ కృష్ణారెడ్డి, మన్నే శ్రీనివాస్, విష్ణు, బొజ్జ వెంకట్ రెడ్డి, మన్నే రాములు, పెద్దలు పాల్గొన్నారు.