కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలు ఉదృతం

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలు ఉదృతం

 

* సీపీఎం చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్

 

రచ్చబండ. శంకర్ పల్లి: కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తున్నామని సిపిఎం చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్, శంకర్ పల్లి మండల కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి అన్నారు. సోమవారం వారు విలేకరితో మాట్లాడుతూ ఆదివారం చేవెళ్లలో జరిగిన బిజెపి బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే విద్య, వైద్యాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని అక్కడ ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వివరింతంగా పెంచి పేద మధ్యతరగతి వారికి తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నదని విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రజలందరిని ఐక్యమతంగా పరిచి రాబోయే రోజులలో పెద్ద పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. దేశంలోని సిపిఎం నేతృత్వంలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం మాత్రమే విద్య, వైద్యానికి, ఉపాధి అవకాశాలకు బడ్జెట్లో 50 శాతం నిధులు ఖర్చు చేస్తున్నదని, గుర్తు చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇలాంటి పథకం లేదని వారు తెలిపారు. ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దించడమే లక్ష్యంగా సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులు పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.