Home Latest News 20 మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

20 మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

20 మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
* జనవాడ, మిర్జాగూడ గ్రామాల్లో మంజూరుపత్రాల అందజేత

రచ్చబండ. శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని జనవాడ, మిర్జాగూడ గ్రామాల్లో 20 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిక చేశారు. జనవాడ గ్రామానికి 10 డబుల్ బెడ్ రూమ్ లు, మిర్జాగూడ గ్రామానికి 10 డబుల్ బెడ్ రూముల లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అధికారులు అందజేశారు. అంతకుముందే ఈ రెండు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి అధికారులు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అనుకున్న మాట ప్రకారం గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ లపై అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇండ్లను కేటాయిస్తున్నారు తెలిపారు. తమ గ్రామాలకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, జనవాడ గ్రామ సర్పంచ్ గౌడ్ చర్ల లలితా నర్సింహ, జనవాడ ఎంపీటీసీ నాగేందర్, మిర్జాగూడ ఉప సర్పంచ్ శాంతి కిషన్ సింగ్, వార్డు సభ్యులు మోత్కుపల్లి అశోక్, ప్రవీణ్, మండల మాజీ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు గౌండ్ల నరసింహ, ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు పాల్గొన్నారు