శంకర్ పల్లి లో ఆరో తేదీన జరిగే మండల లెవెల్ కబడ్డీ పోటీలకు హాజరుకావాలని ఎంపీ రంజిత్ రెడ్డిని ఆహ్వానించిన జూలకంటి పాండురంగారెడ్డి.

శంకర్ పల్లి లో ఆరో తేదీన జరిగే మండల లెవెల్ కబడ్డీ పోటీలకు హాజరుకావాలని ఎంపీ రంజిత్ రెడ్డిని ఆహ్వానించిన జూలకంటి పాండురంగారెడ్డి.

రచ్చబండ శంకర్ పల్లి; ఈనెల ఆరవ తేదీన అరుణోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగే మండల లెవెల్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని శంకర్ పల్లి అరుణోదయ యువజన సంఘం అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి హైదరాబాదులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఆహ్వానించారు.

సోమవారం ఉదయం ఎంపీ నివాసానికి యువజన సంఘం సభ్యులతో ఎంపీని కలిశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, శంకర్ పల్లి మాజీ సర్పంచ్, సంగం గౌరవ అధ్యక్షులు ఎంసాని ప్రకాష్, సంగం సభ్యులు రాంపాల్, మోహన్ రెడ్డి, ప్రణీత్ కుమార్( చిన్న) శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమౌళి, పార్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.