రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల గా నల్లోల్ల గోపాల్ ఎంపిక.

రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల గా నల్లోల్ల గోపాల్ ఎంపిక.

రచ్చబండ శంకరపల్లి; జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండలం ఊరెళ్ళా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

2002లో స్కూల్ అసిస్టెంట్ గా గోపాల్ పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. విద్యార్థులకు చక్కని విద్యా బోధన అందిస్తూ 2009 లో ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొందారు. శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన గోపాల్ ఎంతో కష్టపడి చదివి 2001 డీఎస్సీ యందు స్కూల్ అసిస్టెంట్ గా ఎన్నికైన తదనంతరం 2009 లో ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొందారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గోపాలను మండలంలో పలువురు అభినందించారు.