మహోన్నత నేత.. సుందరయ్య

పేదల పక్షపాతి.. సుందరయ్య

అది 1985 మే 19వ తేదీ.
కమ్యూనిస్టు ధ్రువ తార నింగికి ఎగిరింది.. కోట్లాది మంది శ్రామిక, కార్మిక జనాన్ని ఎడబాసి వెళ్లాడని.. యావత్తు దేశమంతా కన్నీరు పరవంతమైంది.. కృష్ణా నదీతీరం ఎరుపెక్కింది.
ఎర్రజెండాలతో ఎటూ చూసినా లక్షలాది మంది ఆయన అభిమానులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఆయనను అభిమానించే ఇతర పార్టీల సామాన్య ప్రజలు, నాయకులు కూడా ఆయనకు కడసారి వీడ్కోలు చెప్పడానికి సాగర తీరానికి వచ్చారు.. జోహార్లు అర్పించారు.. ఆయన భౌతిక చితికి లావు బాల గంగాధర్ నిప్పటించారు..
ఆ ప్రాంతమంతా శోక సముద్రమైంది. ఆ మహా నేత పుచ్చలపల్లి సుందరయ్యకు కడసారి వీడ్కోలు పలికారు.
—————-
నెల్లూరు జిల్లా అలగాణిపాడులో పుచ్చలపల్లి వెంకట్రామిరెడ్డి, శేషమ్మ గార్లకు ఆరవ సంతానంగా 1931 మే 1న వెంకట్ సుందర్ రామిరెడ్డి జన్మించాడు.
ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గాలకు, కష్ట జీవులకు, కార్మిక వర్గానికి ప్రత్యేకమైన ఇష్టమైన దినం రోజు జన్మించడం కాకతాలీయమే అయినా తర్వాత కాలంలో భారత దేశంలో ఆయన శ్రామిక జనం కొరకు శాస్త్రీయ మార్క్స్ సిద్ధాంత ఆధారంగా 60 ఏండ్ల పాటు మచ్చలేని మహా నాయకునిగా ఎదిగారు. అలా పేదల పక్షపతిగా ఎదిగారు పుచ్చలపల్లి సుందరయ్య.
వీధి బడిలో చదివి, నేలరాతలు రాసి, పెద్ద బాల శిక్ష పూర్తి చేసి, చదువుల్లో చురుకుగా ఉండి.. వారి బావ గారి ఇంట్లో ఉంటూ ఏలూరు, రాజమండ్రి, మద్రాసు ప్రాంతాల్లోచదువుకున్నాడు.
చిన్నతనం లొనే ఆంధ్రపత్రిక లో వస్తున్న వ్యాసాలు, వీరేశలింగం, పానుగంటి, చిలకమర్తి లాంటి కవుల
రచనలు చదివి ఉతేజం పొందాడు. మద్రాస్ విద్యాభ్యాసం ఆయనలోని సుందరయ్యను మరీ ప్రభావితం చేసింది. లయోలా కాలేజీలో చదువుతుండగా HD రాజా గారి ద్వారా అందుకున్న కమ్యూనిస్టు మానిఫెస్టో అన్నిటికన్నా ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయనలో గొప్ప గుణాత్మక మార్పు తెచ్చింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన 200 మందితో యువజన లీగ్ను ఏర్పాటు చేశారు సుందరయ్య.
పరీక్షలు పూర్తి చేసుకొని తన స్వగ్రామానికి వచ్చి హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు.1932లో గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి పిచ్చి కొలతలకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేదలకు చౌకగా ధరలు ఉండాలని నెల్లూరు వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చి పేదలకు ఇంటింటికీ
కావడిపై వెళ్లి చౌకగా అమ్మేవారు.1935 లో
గెజిట్ ద్వారా తన పేరులో చివరి రెండు అక్షరాలు ‘రెడ్డి” తొలగించుకొని సుందరయ్య గా మారిన ఆదర్శ మూర్తి.
1930 లో సత్యాగ్రహం సందర్భంగా అరెస్ట్ అయ్యి తంజావూరు బోరెస్టన్ స్కూల్ లో జైలు జీవితం గడపాడు. ఆయన ఒక ప్రజా నాయకునిగా, విప్లవకారునిగా ఎదగటానికి ఆ స్కూలు ప్రాధమిక పాఠాలు నేర్పింది. ఆయన 18 వ ఏటా అమీర్ హైదరఖాన్ తో తొలి పరిషయం. ఆయన డిగ్రీ పూర్తి చేసి కమ్యూనిస్టు పార్టీ కి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లి 1931 నుండి ఆయన చనిపోయేంతవరకు 55 సవంత్సరాల అంటే ఆయన మరణించే వరకు 1985 మే19 వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా ప్రజల కోసం జీవించాడు. స్వాతంత్ర్యం రావాలని చిన్న తనం లో దేశ భక్తి ఉద్యమం లో గాంధీ గారి ప్రేరణతో అడుగు పెట్టి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఉప్పు సత్యాగ్రహం,సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా తన 17 ఏటనే జైలుకు వెళ్లిన మహనీయుడు సుందరయ్య. స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొంటూనే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కొరకు కృషి చేశాడు.

తెలంగాణ పోరులో ప్రత్యేక పాత్ర
తెలంగాణ ప్రాంతంలో నిజాం దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా దున్నే వానికే భూమి కావాలని వెట్టి చాకిరీ పోవాలని జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికి 1946 నుంచి పోరాట విరమణ అనంతరం వరకు ప్రత్యక్ష పాత్ర సుందరయ్యది.
సాయుధ పోరాట శిక్షణ ఇచ్చి స్వయంగా అడవుల్లో ఉండి ఆయుధం పట్టి దొరల భూస్వాముల విధానాలను
ఎండగట్టి లక్షలాది ఎకరాలు భూమిని పంచి 3000 గ్రామాలను విముక్తి చేసిన నాయకుడు సుందరయ్య.
ఆరోజుల్లో దళంలో పని చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకొని పిలవడం వారి సాధకబాధలు చూడటం సుందరయ్యకు ఉన్న ప్రత్యేకత. ఆయనకు ఉమ్మడి నల్లగొండ జిల్లా తో ప్రత్యేక అనుబంధం ఉండేది. హుజార్ నగర్ తాలూకా పోనుగొడులో సుందరి బసవయ్య, అందె నర్సయ్యలను కొందరు గుండాలు అర్ధరాత్రి నరికి చంపారు. వారి సంతాప సభలో పాల్గొన్న సుందరయ్య మాట్లాడుతూ మనం గొర్రెలు లాగా తలలు ఇవ్వటం కాదు, పులులు లాగా తిరగబడాలి.
ఒక వీరుడు మరణిస్తే వెలా మందేమి జన్మించరు.
మనం కోల్పోయిన
అంత గొప్ప నాయకులని మనం తిరిగి పొందగలమా.. అని ఉద్రేకంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. సాయుధ పోరాట సందర్భంగా
కొరియర్ గా ఒక కామ్రేడ్ నీరసంగా ఉండి నడవలేక పోతుంటే అతనిని సుందరయ్య గారే తన భుజం మీదఎత్తుకొని శిబిరం వద్దకు తీసుకుని వెళ్లినాడని,
దళంలో గాయపడ్డ వారికి, జ్వరం వచ్చిన వారికి ఆయన కు తెలిసిన వైద్యం చేసే వారు.
సాయుధ పోరాటం విరమణ సమయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సందర్భంగా అడవుల్లో ఉన్న దళాలతో, పాటు ఇటు ప్రభుత్వం తో చర్చలు జరిపి, ధైర్యం చెప్పి కేసులు ఎత్తివేసే విధంగా,పార్టీ ద్వారా పునర్నివాసం కల్పించి కాపాడుకున్న ధీశాలి.

భీమిరెడ్డి నరసింహ రెడ్డి గారి ఆత్మ కథలో చెప్పినట్లు సుందరయ్య లేకుంటే అడవుల్లో నుండి బయటికి వచ్చే వాళ్ళం కాదు. ఆయుధం దించేవాళ్ళం కాదని చెప్పటం చూస్తే పరిస్థితిని ఎంత చక్కగా సమయ స్పూర్తితో సుందరయ్య వ్యవహరించాడో మనకు అర్థం అవుతుంది.
ఆయన 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో మద్రాస్ నుండి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు కానీ ఆంధ్ర నుంచి ఆ తర్వాత అసెంబ్లీ కి ఎన్నికైన సందర్భంగా కూడా సాధాసీదాగా, విషయ పరిజ్ఞానం తో ముక్కు సూటిగా చట్ట సభల్లో మాట్లాడేవారు.
ప్రభుత్వాన్ని ప్రజల తరపున మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఒప్పించేవారు.

పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్లి..
పార్లమెంట్ కు సైకిల్ మీద వెళ్లి చపరాసి స్టాండ్ లో తన సైకిల్ పెట్టడం సుందరయ్యకు
ఉన్న నిరాడంబరతకు నిబద్ధతకును తెలియజేస్తుంది. ఆయన రాసిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం..
విప్లవ పదం లో నా ప్రయాణం..
వీరతెలంగాణ విప్లవ పోరాటం.. గుణపాఠాలు,
ఆంధ్ర ప్రదేశ్ లో నదీజలాల పంపకం..
లాంటి పుస్తకాలు ఎంతో విశ్లేషనాత్మకంగా ఉన్నాయి. శాస్త్రీయంగా ఉన్నాయి.
చివరిగా ఒక మాట చిన్న కుగ్రామంలో ఒక భూస్వామ్య కుటుంభంలో పుట్టినా సుందరయ్య లో ఉన్న
మానవ దృష్టి, స్నేహశీలం,
సామాజిక దృక్పథం, సమ సమాజ సిద్ధాంతం,
మార్క్సిజం పై అచంచలమైన విశ్వాసం,
మడమ తిప్పని పట్టుదల,
అంతకు మించి నీతి నిజాయితీ,
క్రమ శిక్షణ, ఉక్కు శిక్షణ, నిరంతరం అధ్యయనం, ప్రజలు, కార్యకర్తలతో సత్సంబంధాలు, చివరిదాకా ఆయనను ఎంతో విలువలు గల కమ్యూనిస్టు నాయకునిగా నిలబెట్టాయి..

—————-
సుందరయ్య గారి పేరుతో సేవా కార్యక్రమాలు..
—————-
సుందరయ్య గారు చేసిన సేవా కార్యక్రమాల స్పూర్తితో అనేక చోట్ల ప్రజావైద్యశాలలు ఏర్పాటు చేసి పేదలకు చౌకగా వైద్యం అందించటం చూస్తున్నాం… దేశంలో రాష్ట్రంలో అనేక చోట్ల సుందరయ్య నగర్ పేరుతో కాలనీలు పోరాటాల ద్వారా ఇండ్ల స్థలాలు సాధించి పక్కా గృహాలు నిర్మించారు. ప్రస్తుతం
కరోనా మహమ్మారి విష ప్రళయం సృష్టిస్తున్న క్రమంలో హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం అద్వర్యం లో 50 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా మందులు, ఆక్సిజన్, భోజనం తో పాటు 24 గంటలు డాక్టర్ పర్వేక్షణ తో పాటు అంకిత భావంతో ప్రజా సంఘాల ప్రతినిధులు రోగులకు తోడ్పాటు అందిస్తున్నారు.
విజ్ఞాన కేంద్రం స్పూర్తితో రాష్ట్రంలో అనేక చోట్ల ఐసోలేషన్ కేంద్రాలు, ఎల్ప్లైన్ కేంద్రాలు వందల సంఖ్యలో పనిచేస్తున్నాయి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా సీపీఎం, ప్రజా సంఘాలు ముందుండి పని చేయడం హర్షణీయం. రాజాకీయలలో పని చేస్తున్న నేటి తరం యువతరానికి *ఆయన విలువలు ఆదర్శాలు కొంతలో కొంతైనా పాటిస్తే నేడు* రాజాకీయాన్ని లాభ సాటి వ్యాపారంగా భావించి, సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్న నేటి రాజకీయాలలో కొంతమేరకైనా నైతిక విలువలు నిలబెట్టాలని ఆశిద్దాం. ఆయన చూపిన మార్గంలో కార్మిక రాజ్య స్థాపన కొరకు అంకితమై ఈ దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం!

పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం


– నెమ్మాది వెంకటేశ్వర్లు,
సీపీఎం సీనియర్ నాయకులు,
సూర్యాపేట,
సెల్ : 9848720533