క‌మ్మ‌నైన అమ్మ మ‌న‌సు

 

నీలోఫ‌ర్ లో ధాత్రి మిల్క్ బ్యాంకుకు విశేష స్పంద‌న‌

ఇత‌ర పిల్ల‌ల కోసం చ‌నుబాలు ఇచ్చి స‌హ‌క‌రిస్తున్న మాతృమూర్తులు

 

రేణుక న‌ల్ల‌గొండ‌లోని ఓ ఆసుప‌త్రిలో పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కానీ నెల‌లు నిండ‌క తీవ్ర అనారోగ్యంతో ఉన్న శిశువును ఆమె కుటుంబ‌స‌భ్యులు ఆమెను అక్క‌డే ఆసుప‌త్రిలో ఉంచి హైద‌రాబాద్ లోని నీలోఫ‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్నా త‌ల్లిపాలు లేక శిశువు గొంతు త‌డారుతోంది. ఆ ద‌శ‌లో అదే ఆసుప‌త్రిలో ఉన్న ధాత్రి మ‌ద‌ర్ మిల్క్ బ్యాంకు నుంచి ఎవ‌రో మాతృమూర్తి ద్వారా సేక‌రించి నిల్వ ఉంచి పాల‌ను అందించ‌డంతో ఆ బిడ్డ రోజుల్లోనే కొలుకొని త‌ల్లి చెంత‌కు చేరుకుంది. ఇలా ఈ ఒక్క త‌ల్లీ బిడ్డ‌లే గాక ఎంద‌రో న‌వ‌జాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన త‌ల్లి పాల బ్యాంకు ఎంద‌రికో ప్రాణం పోస్తోంది. 2017లో ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 8500 మంది త‌ల్లులు 3వేల లీటర్ల‌కు పైగా పాల‌ను పంచి త‌మ మాతృత్వాన్ని పంచుతున్నారు. ఎంద‌రో బాలింత‌లు త‌మ పిల్ల‌లు తాగ‌గా మిగిలే పాల‌ను ఈ బ్యాంకుకు అంద‌జేస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఇలాంటి సేవ‌ల‌ను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల‌కు విస్త‌రింప‌జేయ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.