కాలే యాదయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించండి

కాలే యాదయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించండి
* ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల వినతి
* శంకర్ పల్లి బ్లూవుడ్ కాలనీ, వివేకానంద, టీచర్స్, భవానీనగర్, గాయత్రి వెంచర్లలో ఎన్నికల ప్రచారం

రచ్చబండ, శంకర్ పల్లి: నవంబర్ నెల 30వ తేదీన జరిగే ఎన్నికలలో చేవెళ్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యను భారీ మెజార్టీ తో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మునిసిపల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం ఉదయం నుండి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మూడవసారి టిఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలిచి అధికారాన్ని చేపడుతుందని తెలిపారు. ముచ్చటగా మూడవసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.

కాంగ్రెస్, బిజెపి పార్టీల మాయ మాటలు నమ్మవద్దని ఓటర్లకు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని, పింఛన్లు 2000 నుండి 5000 వరకు ప్రతినెల ప్రభుత్వం ఇస్తుందన్నారు. అలాగే రైతుబంధు 10,000 నుండి 16,000 వరకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇంట్లో ఉన్న మహిళలకు నెలకు 3000 అందిస్తారని చెప్పారు.

అలాగే సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అందుకు ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి కాలే యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కన్నా, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపిటిసి బి. అశోక్ కుమార్, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, జూలకంటి పాండురంగ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.