చేవెళ్లలో కలిసికట్టుగా పనిచేసి హ్యాట్రిక్ సాధిద్దాం
* నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పట్లోల్ల కార్తీక్ రెడ్డి
* కొత్త, పాత భేదం లేకుండా సమన్వయంతో పనిచేయాలి
* ఎమ్మెల్యే కాలే యాదయ్య
రచ్చబండ, శంకర్ పల్లి: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని మనీ గార్డెన్ లో జరిగిన యువ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పట్లాల్ల కార్తీక్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎన్నికల ఇంచార్జీ పట్లోల్ళ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరంగా చెపట్టాల్సిన కార్యక్రమాలు, లీడర్లు కార్యకర్తల మధ్య సమన్వయంపై కూలంకషంగా చర్చించి సలహాలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో నియోజకవర్గంలో అద్భుత ప్రగతి సాదించుకున్నామని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎదో రకంగా ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరిందని చెప్పారు. ప్రతి లబ్ధిదారులను ఓటు అడగండి, ప్రతి ఒక్కరినీ సంప్రదించండి కేసీఆర్ ప్రవేశపెట్టిన అంత గొప్ప పథకాలను కార్యకర్తలుగా మనం ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించి ఓటు అభ్యర్థించాలని కోరారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.
కెసిఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత ముఖ్యంగా యువతదే ఎన్నికల్లో సోషల్ మీడియా, యువజన విభాగాలు కీలక పాత్ర పోషించాలి ప్రత్యర్థులు చేసే అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా సమర్థవంతంగా తిప్పి కొట్టాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపాల్, మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్ కన్నా, సింగపురం మాజీ సర్పంచ్ విట్టలయ్య, నాయకులు ప్రవీణ్ కుమార్, చేగుంట గోపాల్ రెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు, వార్డ్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.