పదేండ్లలో చేవెళ్ల అభివృద్ధి జరగలే

పదేండ్లలో చేవెళ్ల అభివృద్ధి జరగలే..
* నాకోసారి ఎమ్మెల్యేగా అవకాసహం ఇవ్వండి
* కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షాబాద్ భీమ్ భరత్

రచ్చబండ, శంకర్ పల్లి: చేవెళ్ల నియోజకవర్గంలో గత పదేండ్లలో అభివృద్ధి జరగలేదని, తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి షాబాద్ భీమ్ భరత్ ఓటర్లను కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం శేరిగూడ, కొండకల్, కొండకల్ తాండ, మోకిలా తాండ, మోకిలా, పిల్లిగుండ్ల, గోపులారం, మహారాజ్ పేట్, దొంతంపల్లి గ్రామాల్లో, ఇరుకుంట తండా, పొన్నగుట్ట తండాలలో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎస్ రత్నం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, చేవెళ్ల ఎమ్మెల్యేగా పనిచేశారని, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు.

కాగా వీరి 10 సంవత్సరాల పాలనలో చేవెళ్ల నియోజకవర్గం లోని గ్రామాలలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. కాగా ఈసారి తనను ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రకటించిన ఆరు ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తుందని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మోకిలా తాండ గ్రామంలో అశోక్ నాయక్ కుమారుడు శశాంక్ చేతుల మీదుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భీమ్ భరత్ విరాళంగా 50 వేల రూపాయలు అందించారు.

కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి కె. ఉదయ మోహన్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి దేవలా నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ. రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నసీరుద్దీన్ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం, సర్పంచులు కాశీనాథ్ గౌడ్, మోహన్ రెడ్డి, మోకిలా ఏఎంసి చైర్మన్ గోపాల్, నాయకులు ఖాదర్ పాషా, మాజీ సర్పంచ్లు అడవయ్య, నర్సింలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.