సీడబ్ల్యూసీ హమాలీ కార్మికులను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

సీడబ్ల్యూసీ హమాలీ కార్మికులను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
* ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు

సూర్యాపేట టౌన్, రచ్చబండ: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలీ (సీడబ్ల్యూసీ) కార్మికులను నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీడబ్ల్యూసీ హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో వంగూరి రాములు పాల్గొని మాట్లాడారు. 1960 సవంత్సరం లో సూర్యాపేట పట్టణంలో విజయవాడ, హైద్రాబాద్ జాతీయ రహదారిపై శాంతినగర్ సమీపంలో 5వేల సామర్థ్యంతో సీడబ్ల్యూసీ గోడౌన్ ఏర్పాటు చేయటం జరిగిందనీ అయన తెలిపారు.

కాలక్రమేణా ఈ గోడౌన్ ప్రస్తుతం 70 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్ గా విస్తరించి తెలంగాణ రాష్ట్రం లోనే మొదటి స్థానం లొకి వచ్చిందన్నారు. ఈ గోడౌన్ లో గతంలో వడ్లు, అపరాలు, యూరియా, సివిల్ సప్లై బియ్యం ఎఫ్సీఐ బియ్యం ఎగుమతులు దిగుమతులతో నడిసేది అని తెలిపారు. ప్రస్తుతం సివిల్ సప్లై బియ్యాన్ని పూర్తి గా ఖాళీ చేశారని దీనికి కారణం సీడబ్ల్యూసీ అర్ఎం అఫీస్ కు సివిల్ సప్లై వారికి మద్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు కారణమని రాములు తెలిపారు.. దీంతో సివిల్ సప్లై బియ్యం ప్రైవేట్ గిడ్డంగుల లో ఎగుమతి దిగుమతి చేస్తున్నారని, ఎఫ్సీఐ బియ్యం రైల్వే పాయింట్ వద్ద ఉన్న గిడ్డంగులు వద్ద మాత్రమే స్టాక్ పెట్టు తున్నారని అయన అవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ గిడ్డంగులను ప్రయివేట్ పరం చెయడం వల్ల ప్రయివేట్ రంగములో గిడ్డంగుల సంఖ్య పెరిగిందని రాములు తెలిపారు. దీంతో జిల్లాలో ఏకైక ప్రభుత్వ గిడ్డంగి శాంతి నగర్ లో దాదాపుగా 70 ఏండ్ల నుండీ ఉందనీ ఆరోజు నుండి నేటి వరకు సుమారు రెండు వందల మంది పైగా హమాలీలు పని చేస్తున్నారని సూర్యాపేట జిల్లాలో గిడ్డంగులను పదమూడు ప్రయివేట్ సంస్థలను ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్నారు. ప్రభుత్వ గిడ్డంగులల్లో పని చేసే హామాళిలకు ప్రభుత్వ నాలుగు తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా నెలకు 5వేలు పింఛన్లు ఇవ్వాలనీ, హామాలీలకు సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలనీ అయన కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సీడబ్ల్యూసీ హమాలీ సంఘం అద్యక్షుడు బాలరాజు, యాదయ్య, వెంకన్న, మల్లయ్య, నర్సయ్య, రాములు, గణేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.