శంకర్ పల్లి పట్టణంలో హోటళ్లను తనిఖీ చేసిన కమిషనర్ శ్రీనివాస్

శంకర్ పల్లి పట్టణంలో హోటళ్లను తనిఖీ చేసిన కమిషనర్ శ్రీనివాస్
* నిర్వహణ సరిగా లేనందున రూ.75,000 జరిమానా
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని హోటల్లోను గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ హోటళ్లను తనిఖీ చేయగా ఆహార పదార్థాల నిర్వహణ సరిగా లేదని, హోటళ్లలో పారిశుధ్యం కూడా అంతంత మాత్రమే ఉన్నందున ఆయా హోటళ్లకు రూ.75,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటల్ యజమానులు తమ హోటళ్లను పరిశుభ్రంగా ఉంచుకొని వినియోగదారులకు స్వచ్ఛమైన పదార్థాలను, టిఫిన్లను అందివ్వాలని తెలిపారు. హోటల్లు నిర్వహించడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు. శుభ్రత పాటించని హోటళ్లపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇండ్ల పన్నులపై అపరాధ రుసుముపై 90% రాయితీ
శంకర్ పల్లి పట్టణంలో ఇండ్ల పన్నులు, ఇతర పన్నులు చెల్లించని యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 22- 20 23 వరకు అపరాధ రుసుము పై 90% రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో ఇంటి పన్నులు, ఇతర పన్నులు చెల్లించాలని తెలిపారు.