విక్రయించిన ప్లాట్లను మళ్లీ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోండి

విక్రయించిన ప్లాట్లను మళ్లీ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోండి
* సింగాపురం మాజీ సర్పంచ్ లచ్చయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని సింగపూర్ లోని సర్వేనెంబర్ 385/ అ లోని 13 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి గతంలో ప్లాట్లు చేసి విక్రయించాడని, కాగా విక్రయించిన ప్లాట్లను నేడు మళ్లీ విక్రయిస్తున్నాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సింగపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శేరిగూడ లచ్చయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధరణిలో అతని పేరు పట్టేదారుగా రావడంతో ఆయన గతంలో విక్రయించిన ప్లాట్లను మళ్లీ విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తాను శంకర్ పల్లి తహసిల్దార్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రజలను దగా చేస్తున్నందుకు వ్యక్తిపై, అతనికి సహకరిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు మోసపోకుండా అధికారులు చర్యలు తీసుకొని, విక్రయించిన ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా చూడాలని లచ్చయ్య డిమాండ్ చేశారు.