కబ్జాకు గురైన 18 గుంటల భూమిని ఇప్పించాలి

కబ్జాకు గురైన 18 గుంటల భూమిని ఇప్పించాలి
* అధికారులకు బాధితుడు ధరణి రాములు వేడుక

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 508/ ఈ గల భూమిలో 18 గుంటల భూమి కబ్జాకు గురైందని ఆ భూమిని తమ కుటుంబానికి అధికారులు ఇప్పించాలని పొద్దుటూరు గ్రామానికి చెందిన ధరణి రాములు కోరుతున్నారు. ఆదివారం ఆయన దొంతంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు తన 18 గుంటల భూమిని ఆక్రమించుకొని దున్నుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగడం లేదని, పోలీసులు తమని దబాయిస్తున్నారని ఆరోపించారు. సర్వేనెంబర్ 5 0 8/ ఈ లో మొత్తం ఆరు ఎకరాల గుంట భూమి ఉందన్నారు. తనకు ఎకరా రెండు గుంటల భూమి మాత్రమే ఉందని ధరణి రాములు వాపోయారు. మిగిలిన 18 గుంటల భూమి వీరి కబ్జాలో ఉందని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు, అధికారులు తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.