అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
* మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం అన్నారు. ఆదివారం శంకర్ పల్లి మండలంలోని దొంతాన్పల్లి, మహారాజ్ పేట్, గోపులారం, పిల్లిగుండ్ల, ఇరుక్కుంట తండా గ్రామాలలో ఉదయం నుండి గడపగడపకు రత్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని కొనియాడారు.

ఈ సంక్షేమ పథకాలు వారికి, అందేలా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే కేటాయిస్తుందని తెలిపారు. పింఛన్లు రాని వారికి కూడా అవి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో మూడవసారి బి ఆర్ ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఏర్పడుతుందని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ను బి ఆర్ ఎస్ అధిష్టానం ఎవరికి కేటాయించిన వారి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పిల్లిగుండ్ల గ్రామ ఉపసర్పంచ్ ధరణి ఐలయ్య, ఇరుక్కుండా తండా ఉపసర్పంచ్ లక్ష్మణ్ ,శంకర్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్, మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్, జనవాడ గ్రామ వార్డు సభ్యుడు రవి, నాయకులు సామయ్య, బయన్న, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.