షిరిడీ సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నుల పంపిణీ
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు శ్రీ షిరిడీ సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, అయ్యప్ప రెడ్డిగూడా, పిల్లిగుండ్ల, కొండకల్ తాండ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 25 వేల రూపాయల విలువ గల 1000 లాంగ్ నోట్ బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవాదళ్ వ్యవస్థాపకులు కాళ్ల రత్నాజీరావు, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయులు మరుపల్లి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదువుకునే చాలామంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉంటారని, వారికి కొంత చేయూత అందించడానికి నోటి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చిన్ననాటి నుండి బాధ్యతగా క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే జీవితంలో వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు.
ఉపాధ్యాయులు చెప్పిన పార్టీ అంశాలను ఎప్పటికప్పుడు చక్కగా చదువుకొని గురువుల పట్ల, గౌరవంతో మెలుగుతూ మంచి విలువలతో కూడిన విద్యను నేర్చుకున్నట్లయితే కచ్చితంగా విద్యార్థుల కలలు సాకారమైతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శిరిడి సాయి సేవాదళ్ సభ్యులు పి.సుబ్రహ్మణ్యం, చక్రధర్ రావు, కొండూరు శివ సాయి రామ్, జితేందర్ గౌడ్, ఉమామహేశ్వరరావు, సంతోష్ కుమార్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, రాజశేఖర్, సదాలక్ష్మి, బాలమణి విద్యార్థులు పాల్గొన్నారు.