మా భూమిలోకి మమ్మల్నే వెళ్లనీయడం లేదు

మా భూమిలోకి మమ్మల్నే వెళ్లనీయడం లేదు
* మోకిలా సిఐ అడ్డుకుంటున్నారు
* కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం
* బాధితుడు మల్లయ్య ఆవేదన

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలం గోపులారం గ్రామ శివారులో తాము కొన్న భూమిపై వెళ్లడానికి చేవెళ్ల కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినా, మోకిలా సిఐ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సంగారెడ్డి పట్టణానికి చెందిన కే.మల్లయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోపులారం గ్రామ శివారులో సర్వేనెంబర్ 6 ఆలో ఎకరా భూమి నలుగురం కలిసి నగరానికి చెందిన హరి దయాల్ వద్ద జూన్ 2022 సంవత్సరంలో కొనుగోలు చేశామని తెలిపారు. కాగా హరి దయాల్ గోపులారం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి వద్ద భూమి కొనుగోలు చేశారని తెలిపారు.

అదే భూమిని కె.మల్లయ్య, శ్రీకాంత్, వీరేశం, వెంకటయ్య కలిసి కొనుగోలు చేశామన్నారు. ఆ భూమిలోకి వెళ్లకుండా ఓ మాజీ డిఎస్పి, అతని తమ్ముడు తమను అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో తాము చేవెళ్ల కోర్టుకు వెళ్లి తాము కొన్న భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ పొందామని తెలిపారు.

ఇదే విషయం మోకిలా పోలీస్ స్టేషన్లో సీఐ నరేష్ కు వివరించగా, ఆయన ఆ పొలంలోకి వెళ్లకూడదని అక్కడికి వెళ్తే రిమాండ్ కు పంపిస్తానని హెచ్చరించారని చెప్పారు. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చామని తమకు సహకరించాలని కోరినా సీఐ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోస్తే తప్పకుండా సహకరిస్తామని సీఐ తెలిపారని చెప్పారు. ఈ విషయమై తాము సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.