పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
* రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్
* ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కు వినతిపత్రాలు అందజేత
రచ్చబండ, శంకర్ పల్లి: పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్దరించాలని కోరుతూ శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను సోమవారం తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరి పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు దర్శన్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షులు మర్పల్లి అశోక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాహెర్ అలీ, కార్యదర్శి రాముశర్మ, నరసింహులు, చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుపరచి పాత పెన్షన్ పునరుద్ధరణ కై మీట్ అవర్ ఎంఎల్ఎ,ఎంపి,మినిస్టర్ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
రాజస్థాన్, చత్తీస్గడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్,పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానం అమలు పరచాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో వెటర్నిటీ యూనివర్సిటీ సిపిఎస్ ఉద్యోగులు శ్రీనివాస్ యాదవ్, ఇలియాస్ ఆంజనేయులు, రవీందర్,ఆంజనేయులు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.