విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
* జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దామోదర్
రచ్చబండ, శంకర్ పల్లి: ప్రభుత్వ ఆసుపత్రులలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ దామోదర్ హెచ్చరించారు. సోమవారం శంకర్ పల్లి మండలంలోని టంగుటూరు, శంకర్ పల్లి ఆరోగ్య కేంద్రాలలో అందించే రోగులకు అందించే సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దామోదర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణి స్త్రీల ప్రసవాలకు డాక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారికి నెలలు నిండిన నాటి నుంచి వైద్య సేవలు సరైన రీతిలో అందించాలన్నారు. ప్రసవానికి వచ్చిన స్త్రీలకు ఎలాంటి ఆటంకాలు కలవకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.
పసిపిల్లల టీకాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆస్పత్రులలో క్షయ వ్యాధి నివారణ, ఏఎంసి టీకాల నిర్వహణ టీకాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రేవతి రెడ్డి, ప్రియాసింగ్, సుష్మ, ప్రశాంతి, ప్రసన్న, అనూష, శోభ, సిబ్బంది మన్సూర్, పీతాంబరం, మాధవరావు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.