ప్లాట్లు కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి

ప్లాట్లు కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
* మోకిలా గ్రామ ఎస్సీ కాలనీవాసులు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని మోకిలా గ్రామంలో దౌర్జన్యం చేస్తూ తమ కాలనీలోని మూడు ప్లాట్లను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నారని ఎస్సీ కాలనీవాసులు మంగళవారం మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేనెంబర్ 31లో 5- 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వంద గజాల ప్లాట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ ప్లాట్లను ఎస్సీ కాలనీలో లబ్ధిదారుదారులకు అందజేయడం జరిగిందన్నారు.

అందులో మూడు ప్లాట్లు మిగిలి ఉండటంతో ఆ ప్లాట్లు తనవి అని అక్కడికి ఎవరు వెళ్ళకూడదని ఆ వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్ను ఎవరూ ఏమి చేయలేరని బెదిరిస్తున్నాడని వారు తెలిపారు.

ప్లాట్లు కబ్జా చేస్తున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.