బీజీపీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి

బీజీపీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి
* బీజీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్

రచ్చబండ, శంకర్ పల్లి: చేవెళ్ల గడ్డపై భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారి గెలుపు కోసం కార్యకర్తలు బాగా కృషి చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల ప్రకాష్ అన్నారు. మంగళవారం శంకర్ పల్లి పట్టణంలోని కాలనీలలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో ఈసారి తమ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇచ్చినా వారి గెలుపు కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కె. ప్రతాప్ రెడ్డి, మాజీ మండల బిజెపి అధ్యక్షుడు ఏ. నరసింహారెడ్డి, మున్సిపల్ బిజెపి అధ్యక్షులు బీర్ల సురేష్, జిల్లా నాయకులు జయరాం రెడ్డి, చేకూర్త కృష్ణారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.