ప్రజల కష్టాలు తెలిసిన గొప్ప నేత సీఎం కేసీఆర్

ప్రజల కష్టాలు తెలిసిన గొప్ప నేత సీఎం కేసీఆర్
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రజల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొనియాడారు. మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇండ్ల పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల కష్టాలను కనులారా చూసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఈ పథకం లేదని స్వయంగా ముఖ్యమంత్రి పేదల బాధలు తెలుసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదెంటి ఆడపడుచులకు లక్ష 116 రూపాయలు అందించి వారికి అండగా నిలిచారని అభినందించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదలను ఓ అన్నలా, తండ్రిలా ఆదుకుంటున్నారని తెలిపారు. రైతుల కోసం కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేశారని తెలిపారు. దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆదుకుంటున్నారని చెప్పారు. తనను చేవెళ్ల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారని వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తాను గెలిస్తే చంద్రశేఖర రావు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. 59 జీవో ద్వారా రెగ్యులైజ్ అయిన లబ్ధిదారులకు 11 మంది కి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, స్థానిక పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిర్జాగూడ సర్పంచ్ రవీందర్ గౌడ్, మహారాజ్పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, గోపులారం సర్పంచ్ శ్రీనివాస్, గాజులగూడ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పరివేద ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, మహాలింగాపురం ఎంపీటీసీ యాదగిరి, మునిసిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, నాయకులు పార్శి బాలకృష్ణ, నరేందర్ రెడ్డి, జి. నరసింహ, తహసిల్దార్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.