సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది

* జనవాడ సర్పంచ్ గౌడిచర్ల లలితా నరసింహ
రచ్చబండ, శంకర్ పల్లి: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని శంకర్ పల్లి మండలం జనవాడ గ్రామ సర్పంచ్ గౌడిచర్ల లలిత నరసింహ అన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్య చెప్పే ఉపాధ్యాయులను విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. మండలం విద్యాధికారి సయ్యద్ అక్బర్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తును రూపకల్పన చేయడంలో ఉపాధ్యాయుల స్థానం అత్యంత విశిష్టమైనదని తెలిపారు.

విద్యార్థులకు తెలియని విషయాలను అర్థమయ్యే విధంగా బోధించి విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే విధంగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తలారి నాగేందర్, ఉప సర్పంచ్ శ్రీలత రాములు, మండల బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షుడు గౌడు చర్ల నరసింహ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.