చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ కేఎస్ రత్నంకు ఇవ్వాలి

చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ కేఎస్ రత్నంకు ఇవ్వాలి

రచ్చబండ, శంకర్ పల్లి: ఈసారి బి ఆర్ ఎస్ పార్టీ నుండి చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు కేటాయించాలని శంకర్ పల్లి మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక బద్దం సురేందర్ రెడ్డి గార్డెన్ లో సమావేశమై మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ బాధలను తెలుపుకొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కాలే యాదయ్య తమను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆయన ఎన్నికై ఐదు సంవత్సరాలు అయినా ఇప్పటికి తమను పలకరించిన పాపానికి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కష్టాలను తీర్చే ఎమ్మెల్యే తమకు ఉండాలని వారు కోరారు. గతంలో చేవెళ్ల ఎమ్మెల్యేగా పనిచేసిన కేఎస్ రత్నం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవారని వారు గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతమున్న ఎమ్మెల్యే నలుగురు ఐదుగురు నాయకులను వెంటేసుకొని తిరుగుతూ తమను పట్టించుకోవడంలేదని తెలిపారు. తమ విన్నపాలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరకు పత్రికల ద్వారా తెలియచేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వారన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ నల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ అబ్బు, మండల బి ఆర్ ఎస్ నాయకులు బయన్న ,నవాడ గ్రామ వార్డు సభ్యులు రవికుమార్, సింగాపురం దేవయ్య, అంజిరెడ్డి, పిల్లిగుండ్ల ఉపసర్పంచ్ ఐలయ్య, సింహరాజు తదితరులు పాల్గొన్నారు.