పొద్దుటూరు ప్రగతి రిసార్ట్స్ లో సోమయాగ ఉత్సవాలు

పొద్దుటూరు ప్రగతి రిసార్ట్స్ లో సోమయాగ ఉత్సవాలు

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్స్ లో జరుగుతున్న సోమయాగోత్సవాలు ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు సుబ్రహ్మణ్య ఆహ్వానం, చతుర్థి చిత్యు పదాననం, యాప సంస్కారం, సాయం ప్రవర్షం, సుబ్రహ్మణ్య ఆహ్వానం తదితర కార్యక్రమాలు జరిగాయి.

ప్రగతి సుధమ ఆధ్వర్యంలో ప్రకృతి మాత ఫౌండేషన్ ప్రాంగణంలో 13వ తేదీ వరకు ఈ యాగాలు కొనసాగుతాయని ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జి బి కే రావు తెలిపారు. 93 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ సోమయాగానికి అందరూ విచ్చేసి విఘ్నేశ్వరుడి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. శ్రీ యామవరం దీక్షిత అనంతకృష్ణ వాజ పేయా యాజి ఆధ్వర్యంలో ఈ సోమయా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు ప్రగతి గ్రూప్ ఎండి అజయ్ చంద్ర, డైరెక్టర్ రామకృష్ణ, త్రినాథరావు, రమణమూర్తి, డైరీ ఇంజనీర్ డాక్టర్ రవీందర్, ఎస్. వేణుగోపాల్, కె. రాఘవరావు తదితరు ప్రముఖులు పాల్గొన్నారు.