పాత పెన్షన్ సాధనా సంకల్ప రథయాత్రకు సంపూర్ణ మద్దతు

పాత పెన్షన్ సాధనా సంకల్ప రథయాత్రకు సంపూర్ణ మద్దతు
* పోస్టర్ ను ఆవిష్కరించిన ఎండి.తాహేర్ అలీ
* టియుటిఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రఘునందన్ రెడ్డి మద్దతు

రచ్చబండ, శంకేర్ పల్లి : ఈ నెల 16 నుండి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రారంభమై 31న యాదాద్రిలో ముగుస్తుంది. రంగారెడ్డి జిల్లాలోకి షాదనగర్, రాజేంద్ర నగర్ లోకి ఈ నెల 30న యాత్ర ప్రవేశస్తుంది. ప్రతి సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ రథయాత్ర లో పాల్గొని విజయవంతం చెయ్యాలని కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయ్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి.తాహేర్ అలి, శంకర్ పల్లి మండల శాఖ నేతలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, టియూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్ రెడ్డి , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర రావు, టి యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మునీర్ పాషా, టిఎస్సిపిఎస్ఈయు జిల్లా అధ్యక్షులు ఎండి.తాహే ర్ అలీ, టియుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కె.నారాయణ, టియుటిఎఫ్ శంకర్ పల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.సుదర్శన్, వి.శ్రీనివాస్ చారి , టిఎస్సిపిఎస్ఈయు మండల ప్రధాన కార్యదర్శి ఏ. సంజీవ్ కుమార్, టిపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీను, ఎస్.జంగయ్య, ఎస్టియు ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ రెడ్డి, టిఎస్యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉదయశ్రీ, కె.కృష్ణ, టియుటిఎఫ్ ఆర్థిక కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, టియుటిఎఫ్ కార్యదర్శులు బి.మోహన్ రెడ్డి, ఎం.రాముశర్మ, ఎస్.జగదీశ్వర్ గారు, పి శ్రీనివాస్ , ఉపాధ్యాయులు శ్రీనివాస్, బలరాం పాల్గొన్నారు.